Your Status Copied to clipboard !!
Telugu Whatsapp Status | తెలుగు వాట్సాప్ స్టేటస్
ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది.
జీవితం ఒక యుద్దభూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు.
ఎప్పుడూ కింద పడకపోవటం గొప్పకాదు,పడినప్పుడల్లా మళ్లీ పైకి లేవటమే గొప్ప.
సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే.
ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోడు.
ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే, విమర్శ నిన్ను తీవ్రంగా బాధపెట్టగలదని అర్థం.
ప్రవర్తన అద్దంలాంటిది, ప్రతీ వ్యక్తి ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది.
చేసే పనిని ప్రేమించ గలిగితే ఎలాంటి పనైనా సృజనాత్మక స్థాయిని చేరుతుంది.
చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది.
ప్రయత్నం మానేస్తే మరణించినట్టే! ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే!!